- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాలేదు'
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అమరుల త్యాగ ఫలితమే అని సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి విద్యార్థి అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఇలాంటి అమర వీరుల వలన తెలంగాణ వచ్చింది అంతే కాని దొంగ రాజకీయ నాయకుల దొంగ నిరాహార దీక్షల వలన కాదన్నారు. తెలంగాణ సంపదను కొల్లగొట్టే ఇంటి దొంగలను ఇంటికి పంపిద్దాం అంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శ్రీకాంతాచారి త్యాగం వృథా కాదని అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ విధానాలపై గత కొంత కాలంగా సోషల్ డెమొక్రటిక్ ఫోరం వేదికగా పోరాటం చేస్తున్నాడు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన సైతం చేసిన ఆయన కొత్త పార్టీ స్థాపన దిశగా కసరత్తు జరుగుతోందని ఇప్పటికే ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రతిభించించేలా సరికొత్త రాజకీయ వేదికను రూపొందించేలా ఆకునూరి మురళి ప్రణాళికలు వేస్తున్నారు.
Also Read: పందికొక్కుల్లా దోచుకుంటున్నారు : షర్మిల