- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్టోరల్ బాండ్లపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లపై మొదటి నుంచి తాము వ్యతిరేకించామని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వ్యవహారశైలి సరిగా లేదని విమర్శించారు. ఎస్‌బీఐ దగ్గర వివరాలు అందించే టెక్నాలజీ లేదా? అని నిలదీశారు. సమయం లేదని దొంగలను కాపాడేందుకే ఎస్‌బీఐ వివరాలు సరిగా ఇవ్వలేదని ఆరోపణలు చేశారు.
ఏ పార్టీకి ఎన్ని ఇచ్చారో సమాచారం ఇవ్వలేదని, ఎవరెవరికి, పార్టీలకు ఎంత ఇచ్చారో లెక్క తేలాలని, కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన లెక్కలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎస్బీఐ శైలి పారదర్శకత ఉండాల్సిందేనని, దొంగలను, రాజకీయ పార్టీలను కాపాడేందుకు చేసే ప్రయత్నం సరికాదని అన్నారు. లెక్కలు ఇవ్వని అధికారులను విచారణ చేసి జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. అధికారుల వెనుక కేంద్ర పెద్దలున్నారని ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని, కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించాలన్నారు. క్విడ్ ప్రో కో ద్వారా లాభపడిన అందరి వివరాలు బయటకు రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.