- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ బాస్ కొంప ముంచేలా సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్ కు బీఆర్ఎస్ విస్తరణ పెద్ద సవాలుగా మారుతోంది. ఇన్నాళ్లు ఓ ప్రాంతానికే పరిమితం అయిన గులాబీ బాస్ రాజకీయాలు ఇకపై మిగతా రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా మారాయి. బుధవారం తెలంగాణ భవన్ లో ఏపీలోని కర్నూల్ నంద్యాల ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తోట చంద్రశేఖర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది కేసీఆర్ కాదని, కాంగ్రెస్ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొడితే బీజేపీ సహకరించిందని, వీరికి మద్దతుగా వైసీపీ, టీడీపీ లేఖలు ఇచ్చాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం సాధించిన ఘనత తనదేనని, ఉమ్మడి ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణను విముక్తి కల్పించేందుకు చావు నోట్ల తల పెట్టి ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేశానని పదే పదే చెప్పుకునే కేసీఆర్ కు తోట చంద్రశేఖర్ కామెంట్స్ ఇప్పుడు డిఫెన్స్ లో పడేసినట్లైందనే చర్చ జరుగుతోంది.
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందనే చందంగా బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఏపీ ప్రాంత ప్రజలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ రూపంలో అక్కడ రాజకీయ ప్రయత్నం ముమ్మరం చేశారు. ఈ ప్రయత్నాలు కేసీఆర్ కు ఏ మేరకు కలిసి వస్తాయో తెలియదు కానీ అక్కడి ప్రజల ఓట్ల కోసం తెలంగాణ ఉద్యమ క్రెడిట్ ను కాంగ్రెస్, బీజేపీ ఖాతాలో వేయడం ఆసక్తి రేపుతోంది. నిజానికి కేసీఆర్ వైఖరి వల్లే పోలవరంతో పాటు విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు బహిరంగంగానే కేసీఆర్ ను టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
మరో వైపు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రపై కాంగ్రెస్, బీజేపీలు పదే పదే ప్రశ్నలు కురిపిస్తున్నాయి. ఉధ్యమ సమయంలో పెద్ద ఎత్తున యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి నాడు కేసీఆర్ అనుసరించిన వైఖరియే కారణం అనే విమర్శలు ఎలాగు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తెలంగాణను ఇచ్చిన తమకు ఓ సారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి సహకరించిన తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ క్రెడిట్ కేసీఆర్ ది కాదంటూ ఏపీ బీఆర్ఎస్ శాఖ నుంచి వస్తున్న కామెంట్స్ కారు పార్టీని ఏ తీరం చేర్చుతుందో చూడాలి.