- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.15 లక్షలు ఇస్తానని చెప్పి ప్రధాని మోడీ మోసం చేశారు: వీహెచ్ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: మోడీతో దేశానికి నష్టం జరుగుతుందని మాజీ పీసీసీ అధ్యక్షులు వీ హనుమంత్ రావ్ పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అనిపిస్తుందన్నారు. నల్లధనం బయటకు తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని మోడీ ప్రజలను మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.
రైతులని కూడా మోడీ మోసం చేశారన్నారు. మోడీ వచ్చాక పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి అనర్హత వేటు వేసి.. ఇల్లు ఖాళీ చేయించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదన్నారు. బండి సంజయ్ నిరుద్యోగ యువత కోసం పోరాటం అని భ్రమ పెడుతున్నారని మండిపడ్డారు. కానీ కేంద్రం ప్రభుత్వo హామీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. రాహుల్ గాంధీకి అండగా మనమంతా పోరాటం చేయాలసిన అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి గ్రామంలో చెప్పాలని కోరారు. రాహుల్ గాంధీని పార్లమెంట్లో మోడీ చూడలేకే బయటకు పంపారన్నారు. బీజేపీ ఓట్ల రాజకీయం తప్ప ఏం చేయలేదన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచి అని పేర్కొన్నారు. పార్టీలో ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూన్నారనీ, ఇది మంచి పద్ధతి కాదని చురకలంటించారు. పార్టీలో అందరూ బలగం సినిమా తరహాలో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.