TG: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-21 13:31:05.0  )
TG: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) పార్టీ కీలక నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌(Padmarao Goud)కు గుండెపోటు(Heart Attack) వచ్చింది. ప్రస్తుతం డెహ్రడూన్ పర్యటనలో ఉన్న ఆయన గుండెపోటు బారిన పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గుండెనొప్పి అంటూ కుప్పకూలిన వెంటనే హుటాహుటిన డెహ్రాడూన్‌(Dehradun)లోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించారు. పద్మారావును పరీక్షించిన వైద్యులు స్టంట్ వేశారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. పద్మారావుకు గుండెపోటు వచ్చిందన్న విషయం తెలియడంతో గ్రేటర్ బీఆర్ఎస్(Greater BRS) శ్రేణులు కంగారు పడ్డారు. ప్రమాదం తప్పిందని వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. ‘పద్మన్న’ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.



Next Story

Most Viewed