- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటర్న్ జర్నీ.. నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
దిశ, సిటీబ్యూరో : సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను తమ స్వస్థలాల్లో జరుపుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలివెళ్లిన నగరవాసులు రిటర్న్ జర్నీలో ఉన్నారు. సంక్రాంతి పండుగ సెలవులు ముగియటంతో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నందున మంగళవారం చాలా ప్రాంతాల నుంచి నగరవాసులు ఇంటిముఖం పట్టారు. సొంత వాహనాల్లో వెళ్లిన వారిలో ఎక్కువ మంది మంగళవారం సాయంత్రానికి సిటీకి చేరుకోగా, ఆర్టీసీ బస్సులు, రైళ్లను నమ్ముకున్న వారు బుధవారం ఉదయాన్నే నగరానికి చేరుకునేలా ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన ఏపీకి కోడిపందెలను చూసేందుకు, పందెలు ఆడేందుకు వెళ్లిన వారంతా సోమవారమే ప్రయాణమై మంగళవారం మధ్యాహ్నం, సాయంత్రం వరకు సిటీకి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్ర వరకు వివిధ ప్రాంతాల నుంచి నగరవాసులు సిటీకి చేరుకుంటున్నందున వర్కింగ్ డే అయిన మంగళవారం కూడా సర్కారు ఆఫీసుల్లో పెద్దగా సిబ్బంది కనిపించలేదు.
ముఖ్యంగా ప్రతి రోజు వేలల్లో సందర్శకులు వచ్చే జీహెచ్ఎంసీ, సెక్రటెరియట్ వంటి ఆఫీసుల్లో లోపల సిబ్బంది, బయట సందర్శకుల సంఖ్య పలుచగానే కనిపించింది. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఫెస్టివల్ ట్రిప్పు ప్లాన్ చేసుకున్న వారిలో ఆర్టీసీ బస్, రైలు టికెట్లను బుక్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది గురు, శుక్రవారాల్లో నగరానికి చేరుకునే అవకాశముంది. వీరిలో ఎక్కువ మంది వ్యాపారులు, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులున్నట్లు సమాచారం. తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల్లో చాలా మందికి రిటర్న్ టికెట్ లభించకపోవటంతో వారంతా శుక్ర, శనివారాల్లో నగరానికి వచ్చే అవకాశముంది. ముందుగా రవాణా టికెట్లు బుక్ చేసుకోని వారు తిరిగిరావటానికి ప్రైవేటు ట్రావెల్స్‌లు వేలల్లో డిమాండ్ చేస్తున్నట్లు ఏపీకి వెళ్లిన కొందరి కుటుంబ సభ్యులు వాపోతున్నారు.