టైం వేస్ట్ చేయకండి.. బస్సుల్లో ఫ్రీగా తిరుగుతూ ఈ ప్రదేశాలను సందర్శించండి!

by GSrikanth |   ( Updated:2024-01-04 14:26:31.0  )
టైం వేస్ట్ చేయకండి.. బస్సుల్లో ఫ్రీగా తిరుగుతూ ఈ ప్రదేశాలను సందర్శించండి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక ఆరు గ్యారంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసింది. అందులో ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మహిళలంతా పథకాన్ని వినినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఫ్రీ జర్నీ చేస్తున్న రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక సూచన చేసింది. అనవసరంగా బస్సుల్లో తిరిగి పథకాన్ని దుర్వినియోగం చేయకుండా.. పలు ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేసింది. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల్లో చూడాల్సిన ప్రదేశాలను ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

1). మేడిగడ్డ- ఎలా కుంగింది.

2). KCR ఫామ్ హౌస్- ఎన్ని ఎకరాలు.

3). కవితక్క-ఇల్లు.. ప్యాలస్ ఎక్కడుంది.

4). KTR సంస్థానం ఎక్కడుంది.

5). హరీష్ రావు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి.

6). 2014 ముందు వీళ్ళు ఆస్తులు ఎన్ని?

7). ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎన్ని?

8). వీళ్ళ పదవులకు వచ్చే జీతం ఎంత?

9). కిరాయి కొంపలో ఉన్న అక్కకు దుబాయిలో బురుజు కలిఫాలో ఇల్లు ఎలా వచ్చింది?

10). వేల ఎకరాల ఫామ్ హౌస్‌లు ఎలా వచ్చాయి.

11). కోట్లాది రూపాయల విలువైన విలాసవంతమైన భవనాలు ఎలా వచ్చాయి.

12). లగ్జరీ కార్లు ఎన్ని.. చేతి గడియారాలు ఖరీదు ఎంత.

ఇవన్నీ ఫ్రీ బస్సులో తిరుగుతూ మీరు చూడాలి. చూసి ఈ తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఇందు కోసం ఫ్రీ బస్సు పథకం ఉపయోగించుకోండి. నిజాలు తెలుసుకోండి. అని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed