- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సడక్యాత్ర
దిశ, తెలంగాణ బ్యూరో: పాత పెన్షన్ సాధన కోసం ఈనెల 9 నుంచి సడక్యాత్రను ప్రారంభించినట్లు తెలంగాణ ఎంప్లాయిస్అసోసియేషన్(టీ) స్టేట్ ప్రెసిడెంట్ చిలగాని సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్ లాల్ చౌక్ నుండి కన్యాకుమారి వివేకానంద విగ్రహం వరకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్, నప్రూఫ్ సంయుక్త ఆధ్వర్యంలో చేస్తున్నామన్నారు. ఈ సడక్ యాత్ర సోమవారం హైదరాబాద్ చేరుకొనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను జాగృతం చేయడం కోసమే నిర్వహిస్తున్నామన్నారు. ఈ సడక్ యాత్ర జమ్మూ, జలంధర్(పంజాబ్), చంఢీగడ్, సహరాన్పూర్ (ఉత్తరప్రదేశ్), డెహ్రాడూన్, హరిద్వార్ (ఉత్తరాఖండ్), ముజఫర్ణగర్, మీరట్ (ఉత్తరప్రదేశ్), ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్ (మధ్యప్రదేశ్), ఝాన్సీ(ఉత్తరప్రదేశ్), భోపాల్(మధ్యప్రదేశ్), బేతుల్ (మధ్యప్రదేశ్), నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా హైదరాబాద్‌కు రానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గన్ పార్క్ వద్ద తెలంగాణా అమర వీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తామన్నారు. ఇప్పటికే మూడు రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేశాయని, సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర ఉద్యోగులకు మేలు జరిగేలా సీపీఎస్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీమతి జి.నిర్మల, ప్రధాన కార్యదర్శి సీహెచ్ ఆదిత్య, రాష్ట్ర కోశాధికారి గడ్డం బాలస్వామి, రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆనంద్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీమతి వేముల రాధిక సురేందర్ రెడ్డి, హరాలే సుధాకర్ రావు, రాష్ట్ర కన్వీనర్ దొనేపుడి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.