కేబినెట్ నిర్ణయంపై RTC MD సజ్జనార్ రియాక్షన్ ఇదే!

by GSrikanth |   ( Updated:2023-07-31 16:08:37.0  )
కేబినెట్ నిర్ణయంపై RTC MD సజ్జనార్ రియాక్షన్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆ సంస్థ ఎండీ సజ్జనార్​ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు గౌరవం దక్కిందన్నారు. ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed