ప్రయాణికులకు ఆర్టీసీ భారీ షాక్.. మళ్లీ ధరల పెంపు..?

by Mahesh |   ( Updated:2023-04-01 03:38:18.0  )
ప్రయాణికులకు ఆర్టీసీ భారీ షాక్.. మళ్లీ ధరల పెంపు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు ఆర్టీసీ మరోసారి షాక్ ఇచ్చెందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని నేషనల్ హైవేలపై టోల్ ఛార్జీలు 5 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఆ భారం మొత్తాన్ని ప్రయాణికుల వద్ద నుంచి రాబట్టేందుకు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచేందుకు నిర్ణయించింది. ఆర్డినరీ మొదలు.. గరుడ ప్లస్ వరకు ఒక్కో ప్రయాణికుడిపై రూ.౪, అలాగే రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ. ౧౫, ఏసీ స్లీపర్ బస్సులో రూ. 20 వరకు ఛార్జీలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా పెరిగిన ఈ ధరలు ఈ నేటి నుంచే అమలు కానున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రయాణికులు పెరిగిన చార్జీలను గమనించగలరు.

Advertisement

Next Story

Most Viewed