కారు గుర్తు కనబడటం కోసమే ''కంటి వెలుగు'': RS ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
BSP Chief RS Praveen Kumar Says An acre of land for the poor if we are empowered
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమం చేపట్టింది కేవలం కారు గుర్తు కనబడడానికే ప్రారంభించారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. అందుకోసమే కేవలం రీడింగ్ గ్లాసులు ఇస్తున్నారు తప్ప, చత్వారానికి అద్దాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తాను కూడా కంటి వెలుగు చూద్దామని హాస్పిటల్‌కి వెళ్లానని, కానీ ఏ హాస్పిటల్‌కు వెళ్లానో చెప్పనని, చెప్తే హరీష్‌రావు డాక్టర్ ఉద్యోగం తీసేస్తారని తెలిపారు.

బహుజన రాజ్యాధికార యాత్ర రెండో విడతలో భాగంగా ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతేకాకుండా కేసీఆర్ కిట్ ఇస్తున్న ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు, ప్రసవం తర్వాత మగపిల్లాడు జన్మిస్తే 12 వేలు, ఆడపిల్ల జన్మిస్తే 13 వేలు గత నాలుగేళ్లుగా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.

ఆ డబ్బంతా దేనికి ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ అంబేడ్కర్, కాన్షీరాం మహనీయులు కేవలం దళితులకు చెందిన వారుగా చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. భారత రాజ్యాంగం రాసి, హక్కులు కల్పించి, బీసీలకు హక్కులు, రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర తెలియదా? అరవై వేల పుస్తకాలు చదివిన జ్ఞానం ఇదేనా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తెలంగాణ ప్రజలంతా నీ కుటుంబం అయితే జనవాడ ఫాంహౌస్ నీ ఒక్కడికే ఎందుకుందని ప్రశ్నించారు. కేటీఆర్‌కు 17 ఎకరాల ఫాంహౌస్ ఎక్కడిదని నిలదీశారు.

సొంత విమానం, వందకోట్ల లిక్కర్ స్కాం, జోగినపల్లి సంతోష్ వెయ్యి ఎకరాల దత్తత వ్యవహారం ఏంటో, ఎలా చేశారో సీక్రెట్ అందరికీ చెప్పాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఆఫీసర్ రాణి కుముదినికి సీఎస్ పదవి ఇవ్వకుండా, ఏ ముఖం పెట్టుకుని 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర నాయకుడు అంకని భాను, జిల్లా అధ్యక్షుడు స్వామి గౌడ్, ఇంచార్జి శ్రీనివాస్, మధుకర్, జై భీమ్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed