ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది: ఎంపీ చామల

by Gantepaka Srikanth |
ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది: ఎంపీ చామల
X

దిశ, తెలంగాణ బ్యూరో: భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో రహదారులను వెంటనే మెరుగుపరచండి అంటూ ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. భువనగిరి నియోజకవర్గంలోజాతీయ రహదారి 65, 163 లపై ప్రమాదాలు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దీంతో పాటు రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. కొన్ని జంక్షన్‌ల వద్ద 50 ప్రమాదాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల రామచంద్రాపురం వద్ద 15 మంది పాదచారులు గాయపడ్డారని వివరించారు. రోడ్డు ప్రమాద మరణాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. ఈ క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి అవసరమైతే, నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 163ని 8 లైన్‌గా మార్చాలని వివరించారు. వెహికల్ అండర్‌పాస్‌లు, 1 ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 1 సర్వీస్ రోడ్‌ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. మరోవైపు చౌటుప్పల్‌లోని మల్కాపురం ఆందోల్మైసమ్మ దేవాలయం భూ యజమానులకు పెండింగ్‌లోని నష్టపరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని కోరారు.

Advertisement

Next Story