Konaseema: అంతా మంచే జరిగింది..!

by srinivas |
Konaseema: అంతా మంచే జరిగింది..!
X

దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) ఆలమూరు నియోజకవర్గం ఖండ్రిగలోని యానాదుల పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు( Students) ఈనెల 24న రాత్రి ఏడు గంటల సమయంలో అదృశ్యం అయిన విషయం తెలిసిందే. అయితే వారందరినీ పోలీసులు గుర్తించారు. నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు 24న ఇంటి నుంచి వెళ్లిపోయారు. స్కూల్‌కు సక్రమంగా వెళ్లడం లేదని వీరిని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన చిన్నారులు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు అందోళన చెందారు. వారి దగ్గర కనీసం మొబైల్ ఫోన్ కూడా లేకపోవడంతో ఎక్కడ ఉన్నరనే సమాచారం సైతం తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పిల్లల ఆచూకీ కోసం పోలీసులు బృందాలు విస్తృతంగా గాలించాయి.

పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) శివారు ప్రాంతమైన సిద్ధాంతం గ్రామం(Siddhanta village) వద్ద ఆరుగురు పిల్లలను పోలీసులు కనుగొన్నారు. ఆలమూరు యానాదులపేటలో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే ఐదు ఎస్టీ కుటుంబాలకు చెందిన పిల్లలను ఎంతో శ్రమించి క్షేమముగా వారి తల్లిదండ్రుల అప్పగించారు. దీంతో పోలీసుల కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. పోలీసులను సమాజ రక్షకులుగా చూసే కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అంతా మంచే జరుగుతుందని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సైతం ప్రశంసించారు. పోలీసు బృందాన్ని అభినందించారు. ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed