ఇఫ్తార్ విందులో CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఇఫ్తార్ విందులో CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శనివారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌(Kodangal)లో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు(Iftar Dinner) ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు నాకు పాలించే శక్తిని ఇచ్చారని అన్నారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయి దు:ఖం ఉండొచ్చు.. అలాంటి వాళ్లను పట్టించుకోవద్దని కొడంగల్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముస్లింలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ(Congress Party)నే అని అన్నారు. కొడంగల్‌లో ముస్లింల అభివృద్ధికి 25 శాతం ఎమ్మెల్యేలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కొడంగల్ అభివృద్ధి కోసం ఎవరూ హైదరాబాద్ వరకూ రావాల్సిన పనిలేదని.. చిట్టీ రాసిస్తే తానే కొడంగల్‌కు వచ్చి పూర్తి చేస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క సంతకంతో కొడంగల్‌ను వెతుక్కుంటూ అన్నీ ఇక్కడికే వస్తాయని అన్నారు. కొడంగల్ ప్రజలు వెళ్లి.. ఎవరినో.. ఏదో అడగాల్సిన అవసరం లేదని చెప్పారు.

మరోవైపు అంతకుముందు.. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ధర్మబద్దమైన కోరికలు నెరవేరాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు.



Next Story

Most Viewed