ధరణిలో ఏజీపీఏ ఆప్షన్..

by Vinod kumar |
ధరణిలో ఏజీపీఏ ఆప్షన్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములను ఏజీపీఏ, ఎస్పీఏ ఆప్షన్లను ఇవ్వనున్నట్లు బుధవారం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా ఎవరైనా తమ భూములను అమ్ముకునేందుకు ఇతరులకు వెసులుబాటు కల్పించేందుకు అవసరమైన ఏజీపీఏ ఆప్షన్, విదేశాల్లో స్థిరపడిన వారు వారి భూములను అమ్మేందుకు ఎవరికైనా హక్కులు కల్పిస్తూ స్పెషల్ పవర్ ఆఫ్ ఆటర్నీ(ఎస్పీఏ)కి అవకాశమివ్వనున్నారు. ఈ మేరకు ధరణి పోర్టల్ స్టాంప్ డ్యూటీ సర్దుబాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అలాగే ఏజీపీఏ, ఎస్పీఏ డాక్యుమెంట్లు చేసేందుకు మాడ్యూళ్లను తీసుకొచ్చేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

Next Story