రేవంత్ రెడ్డికి సీనియర్ ఎమ్మెల్యే షాక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-17 06:54:10.0  )
రేవంత్ రెడ్డికి సీనియర్ ఎమ్మెల్యే షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య సయోధ్య మాటలకే పరిమితమైందా? తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఖరి పార్టీలో చర్చగా మారింది. జగ్గారెడ్డి ఇస్తున్న ఇఫ్తార్ విందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆహ్వానం లేకపోవడం పార్టీలో చర్చగా మారింది. ఇవాళ సాయంత్రం ఇఫ్తార్ విందు ఇస్తున్న జగ్గారెడ్డి రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మాణిక్ రావు థాక్రే, ఉత్తమ్, కోమటిరెడ్డి లాంటి సీనియర్ నేతలకు ఆహ్వానం పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టిలను మాత్రం ఈ విందుకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం భట్టి పాదయాత్రలో ఉన్నందున ఆయనకు ఆహ్వానం పంపలేదనుకుంటే, పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చ గా మారింది. చాలా కాలంగా జగ్గారెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య వర్గపోరు నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జగ్గారెడ్డి విమర్శించిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఉందని, ఇదే విషయం మరోసారి నిరూపితం అయిందనే చర్చ గుప్పుమంటోంది. ఎన్నికల ఏడాదిలో నేతల మధ్య గ్రూప్ తగాదాలు ఇంకా సమసిపోకపోవడంపై పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీలో నేతల పరిస్థితి ఇలానే కొసాగితే ఇది అంతిమంగా బీఆర్ఎస్, బీజేపీకి లాభిస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌కు తాజాగా పరిణామం ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో చూడాలి.

Read more:

పొలిటికల్ స్ట్రాటజీ వెనుక జగన్ అనే ప్రచారం.. పొంగులేటి క్లారిటీ ఇదే..!

Advertisement

Next Story