- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోమటిరెడ్డిపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు.. రేవంత్‌రెడ్డి రియాక్షన్ ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు సంబంధించి చర్చలు జరుగుతున్న వేళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం లేకనే గత ఎన్నికల్లో ఓడిపోయామని సురేఖ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులను కోరారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. అంతేకాకుండా, క్రమశిక్షణ లేని నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి నష్టం చేసే వారిని సస్పెండ్ చేసి తీరాలని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి నేతల వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని.. అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సురేఖ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
ఇప్పుడు ఇది సమయం కాదని అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని అన్నారు. ఇటువంటి విషయాలు తర్వాత చర్చిద్దామని సూచించారు. వ్యక్తిగత అంశాలు ఇప్పుడు మాట్లాడొద్దని.. ప్రస్తుతం పాదయాత్రకు సంబంధించిన దానిపై చర్చిద్దామని అన్నారు. వ్యక్తిగత అంశాలు ఉంటే ఇంచార్జీని కలవాలని కోరారు. సమావేశం ఎజెండాపై మాత్రమే మీటింగ్‌లో మాట్లాడాలని పార్టీ శ్రేణులకు రేవంత్ సూచించారు. మరోవైపు గాంధీభవన్‌లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తుందని తెలుస్తుంది. రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని నేతల డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాదయాత్రోనే పార్టీ బలపడుతుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ అన్నారు. గతంలో వైఎస్సార్ చేవెళ్ల నుంచి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌కు అధికారం తెచ్చారని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి :
కోమటిరెడ్డిని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయాలి: కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్యే మాట విన్న అధికారులంతా జైలుకెళ్లడం తధ్యం!..: నాగం జనార్దన్ రెడ్డి