ఉపేక్షించేది లేదంటూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-15 09:20:50.0  )
ఉపేక్షించేది లేదంటూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : పొత్తులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను సొంతపార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

హంగ్ గురించి ఎవరు మాట్లాడారో తన దృష్టికి పూర్తిగా రాలేదని, అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా పార్టీకి నష్టం కలిగించేదే అని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా, నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నేతల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడకుడదని పార్టీ అధ్యక్షుడిగా ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై అధిష్టానం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని కానీ, చర్చలు గురించి కానీ ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా చర్యలు తప్పవని రాహుల్ గాంధీ గతంలోనే చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌లోని పాలకుర్తి నియోజవర్గంలో బుధవారం రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది.

పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు చాకలిఐలమ్మ స్ఫూర్తిగా ఆనాడు గడీలను బద్దలుకొట్టిన విధంగానే...ఈరోజు దొరల పాలన నుంచి ప్రజలు మరోసారి విముక్తి కోరుకుంటున్నారని రేవంత్ అన్నారు. స్థానిక శాసనసభ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అవినీతి, దౌర్జన్యాల గురించి కథలు కథలుగా ప్రజలు చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.

తెలంగాణలో ఇంకా ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు, పెత్తందారి పోకడలు ఉన్నాయని వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారని మండిపడ్డారు. విద్యుత్ కోతలు, మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోవడం, రైతు రుణమాఫి జరగకపోవడం వంటి సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Read more:

నా వ్యాఖ్యలను థాక్రే లైట్ తీసుకున్నారు: కోమటిరెడ్డి

Advertisement

Next Story