సీఎస్ సస్పెన్స్! రేవంత్ నిర్ణయంపై ఉత్కంఠ

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-07 06:13:22.0  )
సీఎస్ సస్పెన్స్! రేవంత్ నిర్ణయంపై ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ హయాంలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులను తప్పించేందుకు కాంగ్రెస్ సర్కారు ప్లాన్ చేస్తున్నది. దీంతో సీఎస్ పోస్టును దక్కించుకునేందుకు పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్ద లాబీయింగ్ చేస్తుంటే, ఇంకొందరు రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ప్రస్తుత సీఎస్ శాంతికుమారిని కొనసాగిస్తారా? లేక ఆమెను తప్పించి కొత్త వారిని నియమిస్తారా? అనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది.

ఢిల్లీ స్థాయిలో పైరవీలు..

సీఎస్ పోస్టును దక్కించుకునేందుకు ఐఏఎస్ ఆఫీసర్లు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా సెంట్రల్ సర్వీసులో ఉన్న శశాంక్ గోయల్, అశోక్ ఆ పోస్టుపై ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలోని కొందరు కాంగ్రెస్ పెద్దలను కలిసి రిక్వెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ఇద్దరు ఆఫీసర్లకు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రయారిటీ ఉన్న పోస్టులను ఇవ్వలేదు. దీంతో సెంట్రల్ సర్వీసులోకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనైనా తమకు ప్రయారిటీ దక్కుతుందని లాబీయింగ్ చేస్తున్నారు.

పోస్ట్‌‌ను కాపాడుకునే పనిలో సీఎస్

కేసీఆర్ హయాంలో అపాయింట్ చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా మున్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, ఇండస్ట్రీ సెక్రటరీ జయేశ్ రంజన్, సీఎంవో సెక్రెటరీ స్మితా సబర్వాల్‌ను లూప్‌లైన్‌లోకి పంపుతారని ప్రచారం జోరుగా సాగుతున్నది. అయితే సుమారు పది నెలల క్రితం సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న శాంతికుమారిని తప్పిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్‌లో ఉన్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా పోస్టును కాపాడుకునేందుకు ఆమె లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత కొత్త పోలీసు హా,దా నియమిస్తారనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ డీజీపీని మార్చితే ఆ స్థానంలో రాజీవ్ రతన్‌ను నియమించే చాన్స్ ఉందని టాక్ ఉంది. అయితే కొన్నేళ్లుగా లూప్‌లైన్‌లో ఉన్న అడిషనల్ డీజీ అధికారి శివధర్ రెడ్డిని ఇంటెలీజెన్స్ చీఫ్‌గా నియమించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story