- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ హయంలో పాలమూరుకు తీరని అన్యాయం: రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ హయంలో పాలమూరుకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరై రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో పాలమూరు ప్రజలపై రౌడీ మూకలు దాడులు పెరిగాయన్నారు. దాడులను తిప్పికొడతాం.. దాడులు చేసేవారిని తరిమికొడతామన్నారు. పాలమూరు నుంచి వలసలు ఇప్పటికే ఆగలేదని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం ఎందుకని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉండాలా.. దొరల రాజ్యం ఉండాలా.. రాష్ట్రంలో గడీల ప్రభుత్వం ఉండాలో.. పేదల ప్రభుత్వం ఉండాలో ఆలోచించాలని విజ్ఙప్తి చేశారు. దొరల రాజ్యం కోసమే విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారా అని ఫైర్ అయ్యారు. దొరల రాజ్యంలో 1800 బార్లు, 3 వేల వైన్ షాపులు, 60 వేల బెల్టు షాపులు వచ్చాయని విమర్శలు గుప్పించారు.
Read More..
సీఎం కేసీఆర్ సొంతూరులో గుడి, బడి కట్టించిందే కాంగ్రెస్: రేవంత్ రెడ్డి