110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం: రేవంత్ రెడ్డి

by Satheesh |   ( Updated:2023-11-19 07:38:44.0  )
110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఆదివారం హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి, వచ్చే ఎన్నికల్లో 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రాని పార్టీ.. బీసీ వ్యక్తిని సీఎంను ఎలా చేస్తుందని ప్రశ్నించారు.

బీజేపీ దేశంలోని పది రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఓబీసీ సీఎం ఉన్నారని అన్నారు. బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని చెబుతోన్న బీజేపీ.. బీసీ కుల గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోన్న పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బీసీ కుల గణననే చేయలేని బీజేపీ.. బీసీని సీఎం ఎలా చేస్తుందన్నారు. ఎస్సీ వర్గకరీణపై బీజేపీ చెప్పే మాటలు దళితులు ఎవరూ నమ్మరని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే బీజేపీ ఎస్సీ వర్గీకరణ హామీ గురించి పట్టించుకోదని చెప్పారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అని నొక్కి చెప్పారు. తెలంగాణలో చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగే స్థితిలో కేసీఆర్ లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ చెబుతోందని.. కానీ రాష్ట్రంలో రైతులకు కేవలం 8 నుంచి 10 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని రేవంత్ రెడ్డి మరోసారి అన్నారు. బీఆర్ఎస్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల పెద్దఎత్తున భూ దోపిడి జరిగింది, కేసీఆర్ కుటుంబం ధరణి ద్వారా లక్షన్నర ఎకరాలను దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజాదర్భార్ నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

Read More..

జాబ్ కావాలంటే ఆ పని చేయండి: నిరుద్యోగులకు ప్రియాంక గాంధీ కీలక పిలుపు

Advertisement

Next Story

Most Viewed