- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు
దిశ, డైనమిక్ బ్యూరో: కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్మణ్ బాపూజీ గొప్ప వ్యక్తి అని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం తపించారని కొనియాడారు. అలాగే బాపూజీ స్పూర్తిని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం అన్నారు. ఇక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతేగాక ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.