Prakasam Barrageలో కష్టంగా మారిన బోట్ల తొలగింపు.. మరో కొత్త ప్లాన్ రెడీ

by Mahesh |   ( Updated:2024-09-15 10:40:09.0  )
Prakasam Barrageలో కష్టంగా మారిన బోట్ల తొలగింపు.. మరో కొత్త ప్లాన్ రెడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం, సాగర్ గేట్లను ఎత్తడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage)కి వరద పోటెత్తింది. బ్యారేజ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో 70 గేట్లను పూర్తి స్థాయిలో పైకెత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో నదిలో ఉన్న చెత్త చెదారం తో పాటు ఇసుక బోట్లు కొట్టుకొచ్చి డ్యాంలోని 67, 68, 69 గేట్లను బలంగా ఢీ కొట్టి.. గేట్లకు అడ్డంగా పడిపోయాయి. దీంతో పెను ప్రమాదం నుంచి బ్యారేజ్ బయట పడింది. కాగా వరద తగ్గుముఖం పట్టడంతో నీరు వృధా కాకుండా.. బోట్లను తీసే ప్రక్రియను ఇంజనీర్ల సహయంతో ప్రారంభించారు. కాగా రెండు బోట్లు పూర్తిగా గేట్ల మధ్య ఇరుక్కోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఐదో రోజు బోట్ల తొలగింపును అర్ధాంతరంగా నిలిపివేసిన అధికారుల.. ఆరో రోజు ఉదయం కూడా ప్రయత్నించారు. కాగా బోట్లు పూర్తిగా మునిగిపోవడంతో తొలగింపు ప్రక్రియ మరీ కష్టంగా మారింది. కాగా ఈ సమస్యపై చర్చించిన అధికారులు.. సాయంత్రం వాటర్‌ లోడింగ్ ప్లాన్‌ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం.. గొల్లపూడి నుంచి కార్గో పడవలను అధికారులు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed