- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేసీఆర్ , హరిష్ రావులకు హైకోర్టులో ఊరట

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. క్రింది కోర్టులో వ్యక్తీ గత హజరుకు మినహయింపు ఇచ్చింది. గురువారం విచారణ జరగాల్సి ఉండగా భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాజలింగమూర్తి మరణించడంతో శుక్రవారం విచారణ జరిగింది. కేసీఆర్ హరిష్ రావు అవినీతీ మూలంగా మేడిగడ్డ బ్యారజ్ కుంగుబాటుకు గురైందని రాజలింగమూర్తి ఫిర్యాదు మేరకు భూపాలపల్లి కోర్టు విచారించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని గత సంవత్సరం జూలై లో నోటీసులు జారీ చేసింది.
భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, హరిష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేసీఆర్, హరీషరావు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జిల్లా కోర్టుకు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. ఫిర్యాదు దారు రాజలింగమూర్తి మృతి చెందినట్లు హై కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మీడియా ద్వారా సమాచారం అందిందని న్యాయమూర్తి తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతిచెందితే విచారణ అర్హత ఉండదు అనే అంశాన్ని న్యాయస్థానం పేర్కొంది. ఫిర్యాదుదారు మృతి చెందిన ఘటనలలో కూడా పలుమార్లు విచారణ జరిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఇలాంటీ సందర్భాలలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయని పిపి వివరించారు. వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.