- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కులంపై ఏ విచారణకైనా సిద్ధమే.. కులం చర్చపై కడియం కావ్య ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో:తమ కులంపై జరుగుతున్న చర్చపై కడియం శ్రీహరి కూతురు, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు. తమ కులం విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని.. జాతీయ స్థాయి కమిషన్ మాత్రమే కాదు.. ఏ కమిటీతో అయినా విచారణకు రెడీ అని చాలెంజ్ చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. కడియం శ్రీహరి కులంపై ఎన్నడూ లేనంత స్థాయిలో ఈసారి చర్చ జరుగుతోందని నిజానికి ఆయన గడిచిన 40 ఏళ్లుగా ఇప్పుడున్న కులం సర్టిఫికెట్ తో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేశారన్నారు. అప్పుడు లేని వివాదం ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. తాను దళిత మహిళగా, వైద్యురాలిగా సమాజ సేవకురాలిగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో ఎన్నికల బరిలో నిలిచాన్నారు. కడియం శ్రీహరి దళితుడో కాదో..నిరూపించుకోవాలని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కావ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరూరి రమేశ్ కులం ప్రస్తావన తెచ్చి రాజకీయ లబ్ధి పొందుతున్నారని ధ్వజమెత్తారు.