కేవలం వారి కోసమే బడ్జెట్ పెట్టారా?.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సీరియస్

by Gantepaka Srikanth |
కేవలం వారి కోసమే బడ్జెట్ పెట్టారా?.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశ పెట్టిన బడ్జెట్‌(Union Budget)పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు(Telangana Congress MPs) మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, గడ్డం వంశీ స్పందించారు. శనివారం వీరు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర బడ్జెట్ తయారు చేశారు. ఐదు సార్లు బడ్జెట్‌లో బిహార్ అంశాలను ప్రస్తావించారు. బడ్జెట్‌లో తెలంగాణ అంశం కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ప్రస్తావనే లేదు. విభజన హామీలు, ట్రైబల్ యూనివర్సిటీ గురించి చెప్పలేదు. కేంద్రం వ్యాపారస్తుల కోసమే బడ్జెట్ పెట్టినట్లు అనిపిస్తోందని ఎంపీలు విమర్శించారు.

భారతదేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమని.. అలాంటి నిరుద్యోగం గురించి బడ్జెట్‌లో ఎక్కడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. నిత్యావసర వస్తువుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మోడీ ఎక్కడ ఇప్పుడు ఆ అంశాన్ని చెప్పలేదు. రైతులు, పేద వారి గురించి ఎక్కడ మాట్లాడలేదు. బిహార్ రాష్టానికి మకాన బోర్డు ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో చెప్పారు. తెలంగాణకు ఎప్పటి నుంచో రెండో ఎయిర్ పోర్ట్ అడిగాము. కానీ దాని గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. అసలు రాష్టానికి బడ్జెట్‌లో ఇచ్చింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 7 కోట్ల మంది మాత్రమే రైతులు ఉన్నారా? అయితే అందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో భద్రాచలం ఆలయ నిర్మాణానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని అడిగారు.

కేంద్ర బడ్జెట్ అట్టర్ ప్లాప్ బడ్జెట్ అని విమర్శించారు. ఢిల్లీ, బిహార్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని ఆరోపించారు. బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. తాము ఎన్నో డిమాండ్లు, ప్రతిపాదనలు పెట్టాము. చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. ఉడాన్ స్కీమ్ కింద ఎయిర్ పోర్టులు పెంచుతామని అంటున్నారు.. విమానం టిక్కెట్లపై నియంత్రణ ఉండాలి అది లేకుండా ఎయిర్ పోర్టులు పెంచుతామని అంటున్నారు. ఢిల్లీ గద్దెను దక్కించుకునే ఉద్దేశం బడ్జెట్‌లో చాలా స్పష్టంగా కనిపించింది. దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ చిన్నచూపు చూస్తుంది. తెలంగాణ నుంచి కేంద్రానికి నిధులు ఎక్కవగా వస్తున్నాయి.. సీఎం రేవంత్ రెడ్డి గతంలో కేంద్రంలో అందరి మంత్రులను కలిసి తెలంగాణకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అనే ఆలోచన నుంచి బయటకు రావాలి. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అనే విషయం గుర్తుంచుకోవాలి. గుజరాత్ వ్యాపారస్తులకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఆరోపించారు.

Next Story

Most Viewed