- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rape : రాష్ట్రంలో సంచలన ఘటన.. మద్యం తాగించి ఇద్దరు మహిళలపై లైంగిక దాడి
దిశ, అచ్చంపేట : నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళా కూలీలపై రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడటం కలకలం రేపింది. ఇద్దరు మహిళలను కారులో తీసుకెళ్లి మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రోజువారీగా కూలీకి వచ్చే ఇద్దరు మహిళలపై అచ్చంపేట పట్టణంలోని సోనీ గ్రానైట్ మార్బల్‌కు చెందిన గోవింద్ సింగ్, గజానంద్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం పని పూర్తయిన తర్వాత సాయంత్రం వేళలో బల్మూరు మండలానికి చెందిన ఆ ఇద్దరు మహిళలను కారులో తీసుకెళ్లి హైదరాబాద్ వై జంక్షన్ హాజీపూర్ వద్ద మూడు బీరు బాటిళ్లు, చికెన్ బిర్యాని తీసుకున్నారని.. తదుపరి నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రానికి వెళ్లి అక్కడ కూడా బీర్లు తీసుకొని బాగా తాగించారని తెలిపారు.
ఇద్దరు మహిళలకు బాగా మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక బలవంతంగా అఘాయిత్యం చేసినట్లు తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ క్రమంలో చీకటి ఎక్కువైతుంది ఇంటికి వెళ్లాలని తెలపడంతో దిండి నుంచి కారులో వస్తున్న క్రమంలో ఉప్పునుంతల మండలం వెల్టూరు స్టేజి వద్ద ఒక మహిళను దింపేసి తదుపరి అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద కారులో నుంచి మరో మహిళను కిందికి దింపిన క్రమంలో ఆ మహిళ నిలబడలేని స్థితి ఉంది. దీన్ని గమనించిన స్థానికులు 100కు ఫోన్ చేశారని డీఎస్పీ తెలిపారు. తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకోని ఆ మహిళను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారన్నారు.
ఎస్సీ ఎస్టీ కేసు నమోదు..
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. అనంతరం రాజస్థాన్‌కు చెందిన గోవింద్ సింగ్, గజానంద్ సింగ్‌లపై అత్యాచార కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ ‘దిశ’కు ఫోన్ ద్వారా తెలిపారు.
- Tags
- rape
- nagarkurnool