- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ సార్ బొక్కల కంపెనీని మూసేయండి..
దిశ, యాచారం : కేటీఆర్ సార్ బొక్కల కంపెనీని మూసేయండి అని కొత్తపల్లి గ్రామ యువకుడు సోషల్ మీడియా వేదికగా కోరాడు. కిసాన్ ఆగ్రో ఫీడ్ కంపెనీ పేరుతో చలామణి అవుతున్న బొక్కల కంపెనీని మూసివేయాలని మండలంలోని కొత్తపల్లి, తక్కళ్ళ పల్లి, కిషన్ పల్లి గ్రామస్తులు గత 24 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కొత్తపల్లి గ్రామ యువకుడు సోషల్ మీడియా వేదికగా ఐటి శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కి కంపెనీని మూసివేయాలని వేడుకున్నాడు.
ఈ సందర్భంగా యువకుడు మాట్లాడుతూ జంతు కాళేబరాలతో, మరణించిన పశువుల కుళ్లిన మాంసం, వ్యర్థపదార్థాలను ఉపయోగించి నిల్వ వంట నూనె, డాల్డా, నెయ్యి వంటి ఆహారానికి వాడే పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. దానివల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో భరించలేని దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. కంపెనీ చుట్టూ దాదాపు 6 కీ.మీ మేర దుర్వాసన వెదజల్లుతుందని ఆవేదన చెందారు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని చెప్పాడు. ఐటీ శాఖ మంత్రి తమ సమస్యలను పట్టించుకుని బొక్కల కంపెనీని మూసివేయించాలని కోరారు.