- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- వీడియోలు
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అభివృద్ధికి ఆమడ దూరంలో ఆ గ్రామం
దిశ, యాచారం : యాచారం మండలంలోని చింతపట్ల గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోకుండా పోతోంది. ఆ గ్రామంలో మురుగు నీరు నిలిచి ఉంటోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్డుల్లోని ఓపెన్ డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకుపోయి ఉంది. మురికి నీరు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. వర్షం పడితే చాలు వర్షపు నీరు, ఆ మురికి డ్రైనేజీ నీరు జనావాసాల్లోకి వస్తోంది. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో ఇండ్ల మధ్యలో పిచ్చిమొక్కలు తొలగించకుండా కాలయాపన చేయడంతో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగుతున్నాయి. ఒక్క విధంగా చెప్పాలంటే సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా చింతపట్ల గ్రామం ఉందని చెప్పుకునే పరిస్థితి ఆ గ్రామంలో నెలకొంది.
గ్రామంలో మురికి నీరు పారేందుకు డ్రైనేజీ వ్యవస్థ లేదు. అక్కడక్కడ మురికి నీటి కాలువలు ఉన్నా అవి చెత్తతో నిండడంతో రోడ్లపై మురికి నీరు పారుతోంది. మురికి నీటి కాలువలు నిర్మించక పోవడంతో ఆ మురికి నీరంతా రోడ్లపై పారుతూ కంపు కొడుతోంది. పారిశుధ్యం అస్తవ్యస్తం కావడంతో దోమలు సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణం జరగడం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుధ్య సమస్యతోపాటు వ్యాధులు ప్రబలే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.