- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోటి రూపాయలు ఇచ్చి దాడి చేయిస్తారా..?
దిశ ప్రతినిధి వికారాబాద్ : కోటి రూపాయలు తీసుకొని సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఉద్దేశపూర్వకంగానే జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి చేయించాడని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం దుద్యాల మండలం రగచర్ల గ్రామంలో కలెక్టర్, అధికారులపై దాడిపై జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్రపూరితంగానే కలెక్టర్ ని గ్రామంలోకి తీసుకెళ్లి దాడులకు పాల్పడ్డారని అన్నారు. బోగమోని సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని దాడి చేయించాడు. దాడి చేసిన వారే మళ్లీ పరామర్శ పేరుతో జిల్లా లోకి చొరబడి అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. ఎక్కడ ప్రజా బలం కోల్పోతామని భయంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మధుసూదనాచారిలు వచ్చారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని రోజురోజు కోల్పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఉద్దేశంతో జిల్లాను అభివృద్ధి చేయాలనే చూస్తుంటే, ఓర్వలేని వీరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషన్ నాయక్, విశ్వనాథం సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి, జాఫర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.