కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తా : సున్నపు వసంతం

by Kalyani |   ( Updated:2023-11-07 12:50:09.0  )
కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తా : సున్నపు వసంతం
X

దిశ ,చేవెళ్ల : చేవెళ్ల అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజకవర్గ సీనియర్ నాయకులు సున్నపు వసంతం పేర్కొన్నారు. చేవెళ్ల పట్టణంలోని సున్నపు వసంతం మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ... 5 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశానని, చేవెళ్ల లో పార్టీ తరపున ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను నిలదీశానని, చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ పార్టీ నిలబెట్టానని అన్నారు. చేవెళ్ల లో వసంతం అంటే తెలియని ప్రజలు లేరన్నారు. తను నమ్ముకున్న కార్యకర్తల సూచనల మేరకు చేవెళ్ల ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన అన్నారు.

Advertisement

Next Story