Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబర్లు పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం

by Kalyani |
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబర్లు పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం
X

దిశ, షాద్ నగర్ : రేవంత్ రెడ్డి యూట్యూబర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి జడ్చర్ల వెళుతున్న తరుణంలో మీడియాతో మాట్లాడారు. అధికారంలో రాకముందు ఈ యూట్యూబ్ ఛానల్ ని అడ్డం పెట్టుకొని అడ్డమైన వ్యాఖ్యలు చేసి అవాస్తవాలను వాస్తవాలు చేసింది నువ్వు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అవే యూట్యూబ్ ఛానల్ నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండ కట్టడానికి పనిచేస్తున్నాయని అన్నారు.

యూట్యూబ్ ఛానల్ లను తక్కువ చేసి మాట్లాడమనేది చాలా విడ్డూరంగా ఉంది అన్నారు. రేవంత్ రెడ్డి తన అవసరమైతే ఒక తీరు అవసరమయ్యేక ఇంకో తీరు అంటే ఒడ్డు దాటకముందు ఓడ మల్లన్న ఒడ్డు దాటాక బోడ మల్లన్న తీరులో ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఈ యూట్యూబ్ లను వాడుకొని గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి అధికారంలోకి వచ్చింది నువ్వు కాదా, నీ బండారన్ని బట్టబయలు చేసి నీ అవినీతిని బయట పెడుతుంటే తట్టుకోలేక పోతున్నావు అని అన్నారు. మీ అక్కసును యూట్యూబర్లు మీద చూపిస్తున్నావు బిడ్డ యూట్యూబర్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని గద్దె దించడం పెద్ద విషయం ఏమీ కాదు గుర్తుంచుకో అంటూ ఘాటుగా విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed