- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో తాగుబోతుల హల్‌చల్
దిశ, తాండూరు రూరల్: తాండూరులో మందుబాబుల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మద్యం దుకాణాల్లో పర్మిట్ రూములు లేకపోవడం, బార్లలో ఖరీదు ఎక్కువగా ఉండడంతో మందుబాబులు రోడ్డెక్కుతున్నారు. తాగడానికి ఎక్కడ జాగా దొరికితే అక్కడ సిట్టింగులు వేసి సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సాయంత్రం ఆరు దాటిందంటే ఖాళీ జాగా కనపడిన చోటల్లా మందుబాబులు తిష్ట వేస్తున్నారు. మందుబాబులు ఎక్కడంటే అక్కడ సిట్టింగులు వేస్తున్నారు. రాత్రి పూట కొద్దిగా చాటు దొరికే ప్రాంతాలలో వీరు పాగా వేస్తున్నారు. రాత్రి వేళలో ప్రభుత్వ ప్రాంగణంలో ఎవ్వరు కూడా లేక పోవడంతో ఇదే అదనుగా భావించిన మందు బాబులు అడ్డాగా మార్చుకుని మందు విందు చేసుంటున్నారు.
ప్రధాన ద్వారం సమీపంలో సబ్ రిజిస్టర్, గనులు భూగర్భ శాఖల కార్యాలయాల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలఫలకం వద్ద తాగిన ఖాళీ బీర్ సీసాలు ఓ కాటన్ డబ్బాలో పడేశారు. ఇక్కడ పశువైద్యశాల, వ్యవసాయ శాఖ, విద్యావనరుల కేంద్రం, మండల పరిషత్, స్త్రీ శక్తి భవన్ ఉపాధి హామీ, ఐకేపి, తహసీల్దార్, కార్యాలయంతో పాటు ఖజానా శాఖ ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఖాళీ స్థలాల్లో చెట్ల కింద మద్యం బీరు సీసాలు పడివున్నాయి. కానీ అధికారులు ఎవ్వరూ కూడా అటుగా పరిశీలించకపోవడం విమర్శలకు తావిస్తుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.