- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..
దిశ, శంషాబాద్: 24 గంటల విద్యుత్ ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని కలెక్టర్ హరీష్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యుత్ సంబరాల సందర్భంగా సోమవారం శంషాబాద్ మండలం మదనపల్లి సబ్ స్టేషన్ లో విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు విద్యుత్ అవస్థలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు.
వేసవి కాలం వస్తే ఇంట్లో ఉండడానికే భయపడే వారని చెప్పారు. అలాంటి పరిస్థితుల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్యుత్ శాఖ ఎంతో పురోగతి సాధించింది అన్నారు. ఇప్పుడు రైతులకు విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా అందించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ దశకు చేరుకుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ పై ప్రత్యేకంగా శ్రద్ధ వహించారని అన్నారు. అలాగే విద్యుత్ అధికారులు, కార్మికుల కృషి వల్లే ఈ ప్రగతి సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, శంషాబాద్ ఎంపీపీ జయమ్మ, శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.