- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ జిల్లాలో పుట్టి.. వేరే జిల్లాలో ఎలా పనిచేస్తాం
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: స్థానికత ఆధారంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఉపాధ్యాయులకు స్థానికంగా పనిచేసే అవకాశం లేకుండా పోయిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాధిత ఉపాధ్యాయ ఐక్య కారాచరణ సమితి ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న 317 జీఓను వెంటనే రద్దు చేయాలని, ఏ జిల్లా ఉపాధ్యాయులను ఆ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బాధిత ఉపాధ్యాయులు శనివారం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. లోనికి వెళ్లేందుకు యత్నించిన ఆందోళన కారులను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన మహిళా ఉపాధ్యాయులను సైతం బలవంతంగా లాక్కేల్లారు.
ఈ జిల్లాలో పుట్టి.. వేరే జిల్లాలో ఎలా పనిచేస్తాం
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తల్లిదండ్రులను, పిల్లలను వదిలిపెట్టి ఇతర జిల్లాల్లో పని చేయాల్సి వస్తుందని పలువరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. ఈ జిల్లాలో పుట్టిన తాము.. ఇతర జిల్లాలో ఎలా పనిచేస్తామని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో తామంతా స్థానికతను కోల్పోయి, ఇతర జిల్లాల్లో స్థానికేతరులుగా పని చేయాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇతర జిల్లాల నుంచి రాజకీయ పైరవీలతో ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు వచ్చిన స్థానికేతరులను గుర్తించి, వారందరినీ వారి వారి సొంత జిల్లాలకు తిప్పిపంపాలని డిమాండ్ చేశారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదువుకున్న వారిని ఇక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
న్యాయం కోసం వస్తే.. అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు
తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందకు సీఎం క్యాంపు కార్యాలయానికి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్తే తమను బలవంతంగా అరెస్ట్ చేశారని, కనీసం డీఈఓకు విన్నవించుకుందామన్నా.. లోనికి వెళ్లనీయడం లేదని, బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ముట్టడిలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రాములయ్య, వెంకటప్ప, తెలంగాణ పీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్థన్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు జైకర్ణాకర్‌రెడ్డి, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మల్లారి వెంకట్ రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.పాండులతో పాటు సుమారు 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.