తెలంగాణ ఉద్యమ సమయంలో వారి పాత్ర మరువలేనిది .. ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్

by Sumithra |   ( Updated:2022-10-03 13:26:09.0  )
తెలంగాణ ఉద్యమ సమయంలో వారి పాత్ర మరువలేనిది .. ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్
X

దిశ, తలకొండపల్లి : తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారుల పాత్ర మరువలేనిదని తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం రేలారే రేలా ప్రముఖ గాయని గంగను ఘనంగా పూలమాల వేసి శాలువాతో సన్మానించారు.

అనంతరం ఎంపీపీ నిర్మల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది కళాకారులు తమ శక్తికి మించి గాయకులు, గాయనిలు తమ ఆట పాటలతో నైపుణ్యం ప్రదర్శిస్తూ పలువురిని కనువిప్పు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక భూమిక పోషించారని ఆమె కొనియాడారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కళాకారులను కాపాడుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ రాష్ట్ర అధ్యక్షులు జంతుక శంకర్, శ్రీశైలం గౌడ్, హఫీజ్, ఆల్బర్ట్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story