Rangareddy : ఫార్మా వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్ నాయకుల మద్దతు.. కారణం అదేనా?

by M.Rajitha |
Rangareddy : ఫార్మా వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్ నాయకుల మద్దతు.. కారణం అదేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో రైతులు చేస్తున్న ఫార్మా వ్యతిరేక ఉద్యమానికి(Anti - Pharma Movement) అధికార పార్టీ నాయకులు మద్ధతు పలికారు. కలెక్టర్‌ కార్యాలయం ముందు శనివారం జరిగిన ధర్నాలో రైతులకు సంఘీభావం ప్రకటించారు. యాచారం మండలంలో ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న మేడిపల్లి(Medipalli), నానక్‌నగర్‌(Nanaknager), తాటిపర్తి(Tatiparti), కుర్మిద్ద(Kurmidda) గ్రామాలకు చెందిన రైతులు సుమారు వెయ్యి మంది వరకు తమ భూములను ఫార్మా సిటీకి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. అలాగే, తమ భూములను బలవంతంగా లాక్కోవద్దని కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి రైతులను కలెక్టర్‌రేట్‌కు శనివారం రావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. నోటీసులు అందుకున్న నాలుగు గ్రామాల రైతులంతా పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

గ్రామాల్లోని బాధిత రైతులంతా ఏకమవుతుండటంతో రానున్న పంచాయితీ ఎన్నికల్లో వారి మద్దతు అవసరమని భావించిన కాంగ్రెస్‌ నాయకులు రైతులకు తమ సంపూర్ణ మద్ధతు తెలిపారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, యాచారం మాజీ వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, నానక్‌నగర్‌ మాజీ సర్పంచ్‌ వెంకట్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు స్వయంగా రైతులతో కలెక్టరేట్ చేరుకొని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నాలో కూడా పాల్గొని ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. అయితే అతి త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో గెలుపు ఓటమి లెక్క తేల్చేది రైతులే కాబట్టి.. వారికి వ్యతిరేకంగా వెళితే చిత్తుగా ఓడిపోవటం ఖాయమని.. నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయా గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు.

Advertisement
Next Story

Most Viewed