పోదాం పదండి.... నందీశ్వర మహాక్షేత్ర జాతరకు

by Mahesh |
పోదాం పదండి.... నందీశ్వర మహాక్షేత్ర జాతరకు
X

దిశ, యాచారం: పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. శివ భక్తులకు అత్యంత పర్వదినం మహా శివరాత్రి. పరమ శక్తి స్వరూపుడైన పరమ శివుని అనుగ్రహం లేనిదే ఈ మానవుడైన ముందడుగు వేయలేడు. ప్రపంచమంత శివుని మాయలో నిండి ఉన్నది. అలాంటి మహా మాన్విత ప్రదేశం , పచ్చని ప్రకృతి మధ్య ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదమైన ప్రదేశస్థలంలో శివుడు, పార్వతి దేవిల నందీశ్వర మహా క్షేత్రం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో వెలుగొందుతుంది.

దేవాలయ కమిటీ నిర్వాహకులు మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని రంగులు, విద్యుత్ దీప కాంతులతో సుందరంగా తీర్చిదిద్దారు. నందీశ్వర మహా క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఉపవాస దీక్షలతో రాత్రంతా జాగరణ చేసి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు వసతులు ఏర్పాటు చేశారు. దేవాలయంలోకి వెళ్ళగానే 8 అడుగుల స్వయంబు మహానంది దర్శనమవుతుంది.

గర్భగుడిలోని పార్వతి దేవికి ఎదురుగా శివలింగం ఉండడం గమనార్హం. ఒకే వరుసలో ఈ మూడు కేంద్రీకృతమై ఉండడం అరుదని చరిత్ర కారుల అభిప్రాయం. గతంలో నందీశ్వరాలయం శిథిలావస్థకు చేరడంతో పల్లా నాగేందర్ రావు అనువంశికులు 1967 లో ఆలయం పునర్నిర్మించారు. 1968 లో మొట్టమొదటిగా మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు.

అప్పటినుండి నేటి వరకు దిగ్విజయంగా ఉత్సవాలు ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. మహా శివరాత్రి జాతర ఉత్సవాలు రేపటి నుంచి సోమవారం వరకు నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వాహనాల పార్కింగ్‌, తాగు నీరు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మూడు రోజుల కార్యక్రమాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నందీశ్వర మహాక్షేత్రంలో మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా అఖండ దీపారాధన , గణపతి పూజ , కలశ స్థాపన ధ్వజారోహణం, రుద్రాభిషేకాలు జాగారం ఉంటుంది, రెండో రోజు రుద్రాభిషేకాలు , శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, అన్నదానం, చివరి రోజు రథోత్సవం మరియు వివిధ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

జాతరకు తరలిరండి..

నందివనపర్తి లో మూడు రోజుల పాటు జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల జాతర‌కి ప్రజలు తరలిరండి. నందీశ్వర మహాక్షేత్ర ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు భక్తుల రద్దీ ఉంటుంది. పరిసర ప్రాంతాలైన వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed