జిల్లాల్లోని రైతులు, కూలీల ఖాతాల్లో రైతు ఆత్మీయ భరోసా నగదు జమ

by Mahesh |
జిల్లాల్లోని రైతులు, కూలీల ఖాతాల్లో రైతు ఆత్మీయ భరోసా నగదు జమ
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాలు నిరుపేదలైన అర్హులకు అందేలా ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఆధారంగా గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది. అయితే మొదటి అన్ని గ్రామాలకు దశల వారీగా విస్తీర్ణం ప్రకారం రైతు భరోసా అందిస్తారని ప్రజలు ఆశించారు. కానీ ప్రభుత్వం ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో నూరు శాతం పూర్తయిన తర్వాతే మరో గ్రామంలోని లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని భావించింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లోని 21 గ్రామాలను, వికారాబాద్​ జిల్లాలోని 20 మండలాల్లోని 20 గ్రామాలను ఎంపిక చేసి రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులను గుర్తించింది. ఆ పద్ధతిలో వారి ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేస్తున్నది. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లోని లబ్ధిదారులకు నగదు జమ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రైతు భరోసా ఇలా..

రంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన 21 గ్రామాల్లో 15,531 మందికి రూ.20 కోట్ల 25 లక్షల 7వేల 925లు.. వికారాబాద్​ జిల్లాలో 20 గ్రామాల్లో 8,609 మంది రైతులకు రూ.11 కోట్ల 18 లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన గ్రామాల్లో రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్​ మండలం కొండ్రిగాని బొడ తండాలోని 2468 మంది, వికారాబాద్​ జిల్లాలో కొడంగల్​ మండలం అన్నారం గ్రామంలోని 833 మంది రైతుల అత్యధికంగా ఉన్నారు. అదే రంగారెడ్డిలోని ఫారూక్​ నగర్​ మండలం హజ్​ పల్లి గ్రామంలో 171 మంది, వికారాబాద్​ జిల్లాలోని ధారూర్ మండలం ఔసాపల్లి గ్రామంలో 192 మంది రైతులు అత్యల్పంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..

భూమి లేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందిస్తున్నది. మొదటగా జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 432 మందికి రూ.27 లక్షల 72 వేలు, వికారాబాద్​ జిల్లాలో 660 మందికి రూ.39 లక్షల 60 వేలు కూలీల ఖాతాల్లో జమ చేసింది. ఎంపిక చేసిన గ్రామాల్లో భూమిలేని నిరుపేదలు తక్కువగా రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మండలం పెద్దమ్మ తండా, ఫారూక్​ నగర్​ మండలం హజ్ పల్లి, నందిగామ మండలం అప్పారెడ్డి గూడ, మెయినాబాద్​ మండలం వెంకట్​ పూర్​, కొత్తూర్​ మండలం మక్తాగూడ, కేశంపేట్​ మండలం పోమాలపల్లి గ్రామాల్లో 5గురి కంటే తక్కువగా ఉన్నారు. అదే చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామంలో రైతు కూలీలు లేరని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​ మెట్ కవాడి గూడలో 52 మంది, మంచాల మండలం లింగంపల్లి గ్రామంలో 105 మంది ఇప్పటికీ రైతు కూలీలుగా జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్​ జిల్లాలో పెద్దేముల్ మండలం​ మబ్బపూర్ గ్రామంలో 94 మంది, తాండూర్ మండలం చేంగేశ్వర్ గ్రామంలో 64 మంది, కోట్​ పల్లి మండలం కంకనాలపల్లి గ్రామంలో 57 మంది, కుల్కచర్ల మండలం అనంతసాగర్​ గ్రామంలో 51 మంది చొప్పున అత్యధిక కూలీలు ఉన్నారు. దుద్యాల మండలం సంగైపల్లి గ్రామంలో ఏడుగురు అతి తక్కువ కూలీలు ఉన్నారు.

రంగారెడ్డి జిల్లాలో ఎంపికైన గ్రామాల్లో లబ్ధిదారులు..

మండలం గ్రామం రైతు భరోసా ఆత్మీయ భరోసా

మాడ్గుల సుద్దపల్లి 401 19

యాచారం తక్కల్లపల్లి 764 79

మహేశ్వరం పెద్దమ్మ తండా 645 02

కందుకూర్​ సరస్వతిగూడ 1312 29

చేవెళ్ల ఈర్లపల్లి 439 00

అమన్గల్లు పొలేపల్లి 1156 11

ఫారూక్​నగర్​ హాజ్​పల్లి 171 01

చౌదరిగూడ తుమ్​పల్లి 556 16

కేశంపేట్​ పొమాలపల్లి 1210 05

కొందుర్గ్​ పులుసుమామిడి 604 04

కొత్తూర్​ మక్తాగూడ 1050 03

నందిగామ అప్పారెడ్డి గూడ 830 02

అబ్ధుల్లాపూర్​మెట్టు కవాడిపల్లి 296 52

ఇబ్రహింపట్నం కప్పాపహాడ్ 945 49

కడ్తాల్​ కొండ్రిగాని బోడు తండా 2468 11

తలకొండపల్లి ఖానాపూర్​ 1028 23

మంచాల లింగంపల్లి 379 105

మెయినాబాద్​ వెంకట్​పూర్ 232 02

షాబాద్​ ఎట్లార్రెవల్లి 555 12

శంషాబాద్​ సుల్తాన్​పల్లి 250 05

శంకర్​పల్లి ఎర్రువగూడ 240 02

మొత్తం 15531 432

వికారాబాద్​ జిల్లాలో ఎంపికైన గ్రామాల్లో లబ్దిదారులు.....

మండలం గ్రామం రైతు భరోసా ఆత్మీయ భరోసా

తాండూర్​ చేంగేశ్వర్​ 280 64

కుల్కచర్ల అనంతసాగర్​ 246 51

చౌడపూర్​ మక్తవెంకటాపూర్​ 419 30

దోమ శివారెడ్డి పల్లి 376 42

పరిగి సుల్తాన్​పూర్ 497 ​ 36

మోమిన్​పేట్​ బాల్​రెడ్డిగూడ 472 14

బషీరాబాద్ కిస్మాపూర్​ 419 29

యాలాల్​ తిమ్మయిపల్లి ​ 565 40

దౌల్తాబాద్​ నందరామ్​ 374 11

దుద్యాల సంగైపల్లి 824 07

కోట్​పల్లి కంకనాలపల్లి 322 57

మర్పల్లి గుండ్లమర్పల్లి 363 29

పెద్దేముల్​ మబ్బపూర్​ 570 94

వికారాబాద్​ పెండ్లిమడుగు 513 16

బోంరాస్​పేట్​ నాగెరెడ్డిపల్లి 305 21

కొడంగల్​ అన్నారం 833 14

పూడూర్​ యంకెపల్లే 430 38

నవాబ్​పేట్​ దత్తపూర్ 269 09

ధారూర్​ ఔసాపల్లి 192 29

బంట్వారం నాగారం 340 29

మొత్తం 8609 660

Advertisement

Next Story