- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతన్నకు భరోసా రైతు బంధు, రైతుబీమా..
దిశ, నందిగామ: తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతన్నకు ఎంతో భరోసా ఇస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ, మామిడిపల్లి రైతు వేదికలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగామ గ్రామ పంచాయతీ నుంచి రైతు వేదిక వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్, సర్పంచు ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లు గొర్లపల్లి అశోక్, తోట రాజగోపాల్, మంజుల రెడ్డి, మాజీ చైర్మన్ విట్టల్ ముదిరాజ్, పార్టీ మండల అధ్యక్షురాలు పద్మా రెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షురాలు కాట్నలత శ్రీశైలం, ఆయా గ్రామ సర్పంచులు ఏనుగొండ రమేష్, కవిత శ్రీనివాస్, జేకే నరసింహ, ఏడీ బిక్షపతి, ఏఈఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.