- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులు మొక్కలు నాటారు.. నిర్వహకులు పీకేశారు..
దిశ, యాచారం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ హరితహరం అభాసుపాలవుతోంది. ఆదిభట్ల మున్సిపాలిటీలోని బొంగులూరు గేట్ సమీపంలో సర్వేనెంబర్ 32లో కృతుంగ రెస్టారెంట్ ముందు ఉన్న ప్రభుత్వ భూమిలో హెచ్ఎండీఏ అధికారులు గత మూడు నెలల క్రితం మొక్కలు నాటారు. దాదాపు రెండు మీటర్ల మేర పెరిగిన తరువాత కృతుంగా రెస్టారెంట్ నిర్వాహకుడు దాదాపు 100 పై చిలుకు మొక్కలను పూర్తిగా తొలగించి రెస్టారెంట్ పార్కింగ్ చేసి పచ్చదనాన్ని ఆదిలోనే అంతం చేశారు. వీరికి అధికారులు అండగా నిలిచారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం, పచ్చదనం పునరుద్ధరణ లక్ష్యం ‘మొక్క’ దశలోనే ముగిసిపోతోందని ప్రజలు అంటున్నారు. మొక్కలు నాటడంలో అధికారుల తీరుమెరుగ్గా వున్న, మొక్కల సంరక్షణ సరిగ్గా లేక అధికారుల తీరుపట్ల తీవ్రవిమర్శలు వస్తున్నాయి. హరితీహారం మొక్కలను ప్రభుత్వం క్రమబద్ధీకరించకుంటే కొత్తగా ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం నాటిన మొక్కలు, చెట్లను పీకేసిన వారిపై చర్యలు చేపట్టి, మొక్కల పీకేసిన వారికి జరిమాన విధించాలని ప్రజలు కోరుతున్నారు.