- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
దారుణం.. కారు ఢీకొని ఏడాదిన్నర బాలుడి మృతి
దిశ, మీర్ పేట్: మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటున్న 22 నెలల బాలుడిని కారు ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయాలపాలైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందు గత రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం, జెడ్పి రోడ్ లో వరికుప్పల రామకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో దీక్షిత్ ఇంటి ముందు ఆడుకుంటుండగా కొత్తకాపు దినేష్ రెడ్డి అనే వ్యక్తి టీఎస్ 07 కెడి 4567 గల తన టాటా హరియర్ వాహనాన్ని నిర్లక్ష్యంగానడపడంతో బాలుడిని కారు ఢీ కొట్టింది. బాలుడు కారు చక్రాల కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన బాలుడిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందాడు. మృతిచెందిన బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని నిందితుడు పరారీలో ఉన్నాడని.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఇన్ స్పెక్టర్ తెలిపారు.