- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులతో ఎన్‌డీ ఇన్‌ఫ్రా గేమ్!
దిశ, రంగారెడ్డి బ్యూరో: పేదల భూములను ఆసరాగా చేసుకొని మధ్యవర్తులు రియల్వ్యాపారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 249 పరిధిలోని సబ్‌డివిజన్‌లలో రూ.350 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వ అధికారులు అక్రమంగా ఎన్‌డీ ఇన్‌ఫ్రా కంపెనీకి కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమిలో నిరుపేదలైన ఎస్పీ, ఎస్టీ, బీసీలు ఎన్నో యేండ్లుగా భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమిని సాగు చేసుకునే రైతులను మభ్యపెట్టిన కొంత మంది దళారులు ఎన్‌డీ ఇన్‌ఫ్రాకి కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నప్పుడు మార్కెట్ విలువ ప్రకారం సాగులో ఉన్న రైతులకు ఇచ్చి తీసుకుంటుంది. కానీ ఓ ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
అంతేకాకుండా ఆ రైతులతో 2019 నవంబర్ నెలలో ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్‌లో పెండింగ్ డ్యాకుమెంట్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమిని సక్రమై పద్దతిలో వచ్చినట్టు రూపోందించారు. ఆ తర్వాత పట్టా భూమినే కొనుగోలు చేసినట్లు ఎన్‌డీ ఇన్‌ఫ్రా కంపెనీ భావిస్తోంది. అందులో భాగంగానే ఆ కంపెనీకి కొత్త పాసుబుక్‌లు కూడా వచ్చాయి. పట్టా భూములను కొనుగోలు చేసిన ఎన్‌డీ ఇన్‌ఫ్రా కంపెనీ ఎందుకు ఇప్పటి వరకు రైతులకు డబ్బులు ఇవ్వలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పట్టా భూములు కొనుగోలు చేస్తే పెండింగ్ డాక్యుమెంట్, ల్యాండ్ క్లాసిఫికేషన్, ఫారెస్ట్ జోన్ నుంచి రెసిడేన్షియల్ జోన్‌గా మాస్టార్ ప్లాన్‌లో మార్చలని ఎందుకు ధరఖాస్తులు పెట్టారని అటు రెవెన్యూ అధికారులను, ఇటు ఎన్డి ఇన్‌ఫ్రా కంపెనీ ప్రజా సంఘాలు నిలదీస్తున్నారు.
సర్కారు భూమి..పట్టాగా మార్పు !
ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249లో 1026.19 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు అటవిశాఖ పరిధిలో ఉన్నాయి 1960–61 నుంచి 1964– 65 వరకు ఖాస్రా, సేత్వార్ పహాణిల ప్రకారం ఇది సర్కారి కంచెగా రికారై్డంది. దీనిలో కొంత భూమి సాగుకు యోగ్యంగా ఉండటంతో అప్పటి ప్రభుత్వాలు స్థానిక పేదలకు అసైన్డ్ చేసినట్లు ఉంది. 1965–66 నుంచి 1980–81 వరకు ప్రభుత్వ రికార్డుల్లో ఖుష్కీగా రికార్డులో ఉంది. 1985–86 నుంచి సర్వే నంబర్లు 249, 249/1 మినహా సర్వే నంబర్ 249/2 నుంచి 249/17 వరకు ఉన్న 70.24 ఎకరాలు పట్టా భూమిగా మారింది. నిజానికి 249 సర్వే నంబర్‌లోని మొత్తం భూమి అటవి భూమిగా రికార్డు కాగా, 249/1 నుండి 249/17 వరకు అన్ని సబ్ డివిజన్ సర్వే నంబర్లు స్థానిక రైతులకు అసైన్డ్ చేసినట్లు ఉంది. కానీ కేవలం 249/2 నుంచి 249/17 సర్వేనెంబర్‌లోని భూమి మాత్రమే పట్టా భూమిగా ఎలా మారిందనేదీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
గ్రీన్‌జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చి..
హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లోనూ వీటిని అటవి భూములుగా రికార్డు చేశారు. అయితే ఈ భూ ములపై కన్నేసిన కొంత మంది రియల్టర్లు, మాజీ ఐఏఎస్‌లు, రాజకీయ నేతలు ఎలాగైనా వీటిని సొంతం చేసుకోవాలని భావించారు. మార్కెట్ ధర కంటే తక్కువకే ఈ భూములు వస్తుండ టంతో రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో కలిసి పాత రికార్డులను మాయం చేశారు. అసలు సర్వే నంబర్‌కు అనేక సబ్ డివిజన్లు సృష్టించారు. ఆ తర్వాత ఓ ప్లాన్ ప్రకారం సర్వే నంబర్ 249/2 నుంచి సర్వే నంబర్ 249/17 వరకు ఉన్న 70.24 ఎకరాలు పట్టా భూములుగా ప్రకటించారు.
ఆ మేరకు ఆయా శాఖల అధికారులు ఇచ్చిన రిఫరెన్స్ లెటర్లను జత చేసి హెచ్‌ఎండీఏకు ధరకాస్తు చేశారు. హెచ్‌ఎండీఏ సైతం ఏమాత్రం ఆలోచించకుండా సదరు సర్వే నంబర్లలోని భూమిని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించింది. అంతే కాదు అప్పటి వరకు గ్రీన్‌జోన్ పరిధిలో ఉన్న భూములను ఏకంగా రెసిడెన్షియన్ జోన్‌గా మార్చేసింది. ఇదిలా ఉంటే 249/1లోని భూమి గ్రీన్ జోన్‌లో ఉంటే.. దానికి పక్కనే ఉన్న వివాదాస్పద సర్వే నంబర్లలోని భూములు మాత్రం ఎలా రెసిడెన్షియల్ జోన్‌లోకి మారాయో అంతుచిక్కడం లేదు.
రియల్టర్ గుప్పిట్లో అటవీ భూములు..
బహిరంగ మార్కెట్‌లోని భూ ధరతో పోలిస్తే ఎకరాకు సుమారుగా రూ.5కోట్లు ఉంటుంది. కానీ ఎన్‌డీ ఇన్‌ఫ్రా కంపెనీ అదే రైతుల దగ్గర నుంచి ఎకరాకు రూ.80 లక్షల చొప్పున చెల్లించి కొనుగోలు చేసినట్లు ప్రచారం సాగుతోంది. పట్టా భూములను నిజంగా రైతులు ఇంత తక్కువకు విక్రయిస్తరా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కానీ ఆ భూమి అసైన్డ్ భూమి కావడం చేతనే ముందస్తుగా రైతులతో ఒప్పందాలు చేసుకుని సగం డబ్బులే చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకొని రెవెన్యూ శాఖలో ఆ భూమి పట్టా భూములుగా నమోదు చేసుకున్నారు. ఈ భూమిని అనంతపురం జిల్లాకు చెందిన దండు కరుణాకర్ రెవెన్యూ శాఖలో క్రమబద్దీకరణ చేసేందుకు ఎన్‌డీ ఇన్‌ఫ్రా దగ్గర ఒప్పందం కుదుర్చుకున్నారు.
అందులో భాగంగానే ఎన్‌డీ ఇన్‌ఫ్రా దండు కరుణాకర్‌కు 249/4ఈ, 249/4ఇ, 249/14ఇ, 249/10ఇ, 249/14ఈ, 249/10ఈ సర్వే నెంబర్లలో కలిపి మొత్తం 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా ఎన్‌డీ ఇన్‌ఫ్రా పేరుపై 27 నెంబర్ల సబ్‌డివిజన్ సర్వే నెంబర్లపై 30 ఎకరాల 32 గుంటలు, అలాగే నన్నపనేని నందితపై 36 నెంబర్ల సబ్ డివిజన్ సర్వే నెంబర్లతో 26 ఎకరాల 13 గుంటలు, మరో నన్నపనేని వ్యక్తి పై 11 ఎకరాల 25 గుంటల చొప్పున రైతుల వద్ద భూములు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
సీబీఐ విచారణ చేసి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి..
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ గ్రామ పరిధిలోని 249/2 నుంచి 249/17 వరకు ఉన్న సర్వే నెంబర్లోని అసైన్డ్ భూమిలో రియల్ వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతులు దగ్గర ఉన్నప్పుడు అసైన్డ్గా... రియల్ వ్యాపారుల చేతిలోకి వెళ్లినప్పుడు పట్టాలుగా మారడమే ఏమిటని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు రియల్ వ్యాపారులకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. ఈ సర్వే నెంబర్లో జరిగిన అవకతవకలపై పూర్తిగా సీబీఐ విచారణ చెపట్టి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.-ఓరుగంటి యాదయ్య, సీపీఐ రాష్ట్ర నాయకుడు