'ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి'

by Sumithra |
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి
X

దిశ, చౌదరిగూడ : బీఆర్ఎస్ పార్టీవి మాటలు తప్ప చేసింది ఏమీ లేదని రాష్ట్రాన్ని దోచుకొని తింటూ ప్రజలను మోసం చేస్తున్నారని షాద్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి.శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. చౌదరిగూడ మండలంలో మండల అధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార సభలో భాగంగా భారీ బైక్ ర్యాలీతో కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, ప్రతాప్ రెడ్డిలకు స్వాగతం పలికారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి 600ల మందికి పైగా వీరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అన్యాయని వీడి న్యాయం వైపు వచ్చామని నిజాయితీగా నిలబడిన వీర్లపల్లి శంకర్ గెలుపు కోసం అందరము కృషి చేయాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలే తప్ప ఇప్పుడు ఎక్కడ ఏమి రాలేవని తెలియజేశారు. కేసీఆర్ చెప్పిన పాత మేనిఫెస్టోనే అమలు కాలేదని ఇంకా కొత్తది ఏమైతదని ఎద్దేవా చేశారు. త్వరలో 50 మంది వరకు సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు.

కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి.. వీర్లపల్లి శంకర్

60 సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ అని దానిని నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని షాద్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కోరారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని అధికారంలోకి ఇచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని దొరల నుండి తెలంగాణ విముక్తి చెందాలంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం కాంగ్రెస్ రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీపీ యాదమ్మ, జమ్రుద్ ఖాన్, క్రాంతిరెడ్డి, బస్వరాజ్ గౌడ్, కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed