ఓటమి మరచి ప్రగల్భాలా... ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం

by Sumithra |
ఓటమి మరచి ప్రగల్భాలా... ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం
X

దిశ, కొడంగల్ : ఓటమి మరచి ప్రగాల్భాలు పలుకుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినుద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశాడు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా తన స్వగృహంలో కార్యకర్తల నుద్దేశించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు విసిరిన సవాల్ ను ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం తిప్పి కొట్టారు. కొడంగల్ పట్టణ కేంద్రంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కల్సి మీడియా సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2018 లో జరిగిన ఎన్నికల్లో తనతో పోటీ పడి, ఒక వేళ తాను ఓడి పోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నా రేవంత్ కు మాట్లాడే నైతిక హక్కు లేదని తేల్చి చెప్పాడు. నాటి ఎన్నికల్లో తన చేతిలో ఓటమి చవిచూసి అది మర్చి నేడు సీఎం కేసీఆర్ కు సవాల్ విసరడం విడ్డురంగా ఉందని ముందు తన పై గెలవాలని ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కు సవాల్ విసిరాడు. కేటీఆర్ దత్తత తీసుకున్నందుకే నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు, మూడు మండలాలు ఏర్పడ్డాయని, నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు 600 కోట్లు నిధులు కేటాయించినట్టు ఆయన గుర్తు చేశాడు.

అదేవిధంగా కొడంగల్ లో డిగ్రీ కళాశాల, బొంరస్ పేట్, దౌల్తాబాద్ మండలాలకు జూనియర్ కళాశాలల మంజూరు చేశారన్నారు. అలాగే వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల నూతన భవన నిర్మాణాలకు 25 కోట్లు నిధులు, బొంరస్ పేట్, కొడంగల్, దౌల్తాబాద్ మండల కేంద్రాలలో రోడ్డు వెడల్పునకు 5దేసి కోట్లు, కోస్గి, మద్దూర్ మండల కేంద్రాలలో రోడ్డు వెడల్పునకు 7డేసి కోట్లు మంజూరు చేసి 10 ఊర్లకు రవాణా సౌకర్యాలు మెరుగు పరిచాయన్నారు. అలాగు మద్దూర్ మండలం తిమ్మారెడ్డి పల్లి వాగు పై వంతెన నిర్మాణానికి 6 కోట్ల నిధుల మంజూరు కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే జరిగాయాయని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ విమర్శలను ఆధారాలతో సహా పట్నం తిప్పి కొట్టారు. ఓటుకు నోటులో అడ్డంగా దొరికి కొడంగల్ పరువు దిగజార్చాడని టీపీసీసీ అధ్యక్షుడి నుద్దేశించి పట్నం విమర్శించాడు. రెండేళ్లు కరోనా విపత్తు సమయంలో రెండు పర్యాయాలు తనకు కరోనా సోకిన ప్రాణాలను సైతం లెక్క చేయక కొడంగల్ ప్రజలకు సేవ చేసానని పట్నం గుర్తు చేశాడు.

కానీ ఆ కరోనా విపత్తు సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు, అతడి సోదరుడు ఇరువురు కూడ కొడంగల్ ప్రజలను విస్మరించారని మండిపడ్డాడు. తాను కొడంగల్ ఎమ్మెల్యే గా ఎన్నికైన అనంతరం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ సొంత పనులు చక్కబెట్టుకునేందుకే సమయం కేటాయించడని సంవత్సరానికి ఒక్కసారి కూడ కొడంగల్ ప్రజల కు అందుబాటులో లేడని ఆరోపించాడు. 300 కోట్ల కు పీసీసీ పదవి కొని సీటు కొక రేటున అభ్యర్థులకు సీట్లు అమ్ముకుంటున్నాడని అన్నారు. ఆ పార్టీ అభ్యర్థులే చెప్పడం టీపీసీసీ అధ్యక్షుడి రాజకీయ అవినీతి కి పరాకాష్ట అని పట్నం సంచలన ఆరోపణలు చేశాడు. గతంలో గురునాథ్ రెడ్డి ఆశీస్సులతో గెలిచిన తాను అతడి తో కల్సి గతం లో ఐదేళ్లు కొడంగల్ నియోజకవర్గానికి గత పాలకులకంటే అధికంగా అభివృద్ధి చేసినట్టు తెలిపాడు. ఓటమి పాలైతే రాజకీయ సన్యాసం చేస్తానన్న రేవంత్ ను నిలదీసేటందుకు కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అందుకే ధైర్యం లేక దొంగలా వచ్చి వెళుతున్నాడని టీపీసీసీ రేవంత్ నుద్దేశించి పట్నం హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed