- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధి అవకాశాలను ఏర్పరచుకోవాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ, శంకర్ పల్లి : స్వయం ఉపాధి అవకాశాలను ఏర్పరచుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని పత్తేపురంలో శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్ ప్రైజెస్ దుకాణాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఉపాధి అవకాశాలను ఏర్పరచుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఆమె గుర్తు చేశారు. నిరుద్యోగ నిర్మూలన కోసం ఉద్యోగ నోటిఫికేషన్ వేశామని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి ఘణవిజయం సాధించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ చైర్మన్ సాత విజయలక్ష్మి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, శంకర్పల్లి సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, విట్టలయ్య, సాత ప్రవీణ్, పాండురంగారెడ్డి, గోపాల్ రెడ్డి, వాసుదేవ్, గోవర్ధన్ రెడ్డి, బొల్లారం వెంకటరెడ్డి పాపారావు, మహేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, సర్పంచ్ నరసింహ రెడ్డి తదితరులు ఉన్నారు.