కాసాని జ్ఞానేశ్వర్ గెలిపిద్దాం : మాజీ ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
కాసాని జ్ఞానేశ్వర్  గెలిపిద్దాం : మాజీ ఎమ్మెల్యే
X

దిశ, పరిగి : ఈ నెల 13 న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ముదిరాజ్ ముద్దు బిడ్డ, బహుజనవాది , అన్ని కులాల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కృపలో మహేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పరిగి మండల పరిధిలోని బాబాపూర్, సాలిపల బాట తండాలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను గెలిపిస్తే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పరిగి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ కుమార్, బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.

Next Story