348 లే అవుట్లు బ్యాన్..

by Sumithra |
348 లే అవుట్లు బ్యాన్..
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : హెచ్‌ఎండీఎ పరిధిలో పంచాయతీ లే అవుట్లు చేసి సామాన్య, మధ్య తరగతి ప్రజలను రియల్​ వ్యాపారులు మోసం చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. గత ప్రభుత్వాల్లో నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా లే అవుట్లు చేశారు. ఇందులో అధికారుల పాత్రతో పాటు అప్పటి ప్రభుత్వాల్లోని నాయకులు, రియల్​ వ్యాపారులు కుమ్మక్కై నిబంధనలు పట్టించుకోకుండా లే అవుట్లు చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఒక్కొక్కటిగా క్రమబద్ధీకరిస్తూ సంబంధిత అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగానే హెచ్​ఎండీఏ అధికారులకు అనధికారికంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ లే అవుట్ లో జరిగే రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సూచించింది. హెచ్‌ఎండీఏ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పంచాయతీ లే అవుట్ల వివరాలను జాబితా విసోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. అటు హైడ్రా.. ఇటు అనధికారిక పంచాయతీ లేవుట్ల బ్యాన్ తో జిల్లాలోని రియల్​ వ్యాపారులు అయోమయంలో పడ్డారు.

అక్రమ లేవుట్లు బ్యాన్​..

రంగారెడ్డి జిల్లాలోని పాత 10 మండలాల పరిధిలో 348 పంచాయతీ లే అవుట్లను నిషేధిత జాబితాలో పెట్టాలని హెచ్‌ఎండీఏ అధికారులు సంబంధిత సబ్ రిజిస్ట్రార్లకు నివేదికలు సమర్పించారు. ప్రధానంగా ప్రణాళిక లేకుండా రూపొందించిన లే అవుట్, మురుగు, నీరు, విద్యుత్ సరఫరాతో పాటు సెట్​బ్యాక్​, కనీస మౌలిక సదుపాయాలు లేని లే అవుట్లను నిషేధిస్తున్నట్లు హెచ్​ఎండీఏ అధికారులు వివరించారు. మండలాల వారీగా సర్వే నంబర్లు, లే అవుట్​ పేరు, యాజమాన్యం పేరుతో సహా వివరాలను హెచ్‌ఎండీఏ వెల్లడించింది. ఇక నుంచి హెచ్‌ఎండీఏ వెల్లడించిన అక్రమ లే అవుట్ల విషయంలో రిజిస్ట్రేషన్లను జరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.

శంషాబాద్‌లోనే అత్యధిక అక్రమ లే అవుట్లు...

రంగారెడ్డి జిల్లాలోని సరూర్​నగర్​, హయత్​నగర్​, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు​, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్​ పాత మండలాల పరిధిలో అక్రమ లే అవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శంషాబాద్​ మండలంలో 133 ఉండగా, అతి తక్కువగా చేవెళ్ల, కందుకూరు లో 2 చొప్పున, షాబాద్​లో 3 అక్రమ లే అవుట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నారు. మొయినాబాద్​లో 59, హయత్‌నగర్‌లో 40, సరూర్​నగర్​లో 41, ఇబ్రహీంపట్నంలో 35, రాజేంద్రనగర్​లో 27, మహేశ్వరంలో 6 చొప్పున అక్రమ లే అవుట్లు ఉన్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed