- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kalwakurthy MLA : డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు ఆమనగల్లు అనుకూలం
దిశ,ఆమనగల్లు : డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు ఆమనగల్ మండల కేంద్రము అనుకూలమైనదని, ప్రజా పాలన సౌలభ్యం కోసం ఆమనగల్లు లో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి లేఖ రాశారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనుల నిమిత్తం ఆమనగల్లు,తలకొండపల్లి,కడ్తాల్ మండలాల ప్రజలు కందుకూరు, మాడుగుల మండల ప్రజలు ఇబ్రహీంపట్నం వెళ్లాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా నాలుగు మండలాల ప్రజలు సబ్ ట్రెజరీ కార్యాలయం కోసం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి, ఏసీబీ కార్యాలయ సేవల కోసం ఆమనగల్లు, కడ్తాల్ తలకొండపల్లి మండలాల ప్రజలు షాద్నగర్, మాడుగుల మండలం ప్రజలు ఇబ్రహీంపట్నం వెళ్లాల్సి వస్తుందని,దీంతో డివిజన్ కార్యాలయా సేవల కోసం ప్రజల దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, నాలుగు మండలాలకు ప్రధాన కూడలి అయిన ఆమనగల్లు కేంద్రంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీస్,సబ్ ట్రెజరీ కార్యాలయం, ఏసీపీ,ఆర్టీవో, అగ్నిమాపక కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.