- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Disha Effect : మంగ రాశి కుంటను పరిశీలించిన ఇరిగేషన్, పంచాయతీ అధికారులు
దిశ శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 384, 414, 415, 416,419, లలో ఏడు ఎకరాలలో పురాతనమైన మంగరాశి కుంట ఉంది. అయితే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మాజీ ప్రతినిధులు కలిసి 7 ఎకరాల కుంటలో ఎలాంటి అనుమతులు లేకుండా 111 జీవో కు విరుద్ధంగా వెంచర్ చేసి విక్రయించారు. ఈ సంఘటనలు దిశ పత్రికలో మంగళవారం కుంటను మింగిన ఘనులు అనే శీర్షికతో వార్త రావడంతో ఇరిగేషన్, పంచాయతీ, రెవెన్యూ అధికారులు స్పందించి గురువారం నరుకూడా లోని మంగరాశి కుంటను పరిశీలించి కుంటలో వెలిసిన అక్రమ వెంచర్ ను పంచాయతీ అధికారులు కడీలను తొలగించారు. కుంట ఎఫ్ డి ఎల్, బఫర్ జోన్ లను ఇరిగేషన్ అధికారులు బౌండరీస్ ఏర్పాటు చేశారు. ఈ కుంటలో వెలిసిన అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా శంషాబాద్ ఎంపీఓ ఉషాకిరణ్ మాట్లాడుతూ…శంషాబాద్ మండలం పూర్తిగా 111 జీవో పరిధిలో ఉండటంతో ఇక్కడ వెంచర్లకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. అదేవిధంగా ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దిశ పత్రికలో మంగరాశి కుంటలో వెంచర్లో అక్రమ నిర్మాణాలు జరిగాయని రావడంతో మంగ రాశి కుంటను పరిశీలించి అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయడానికి సిద్ధం చేశామని అన్నారు. అతి త్వరలో అక్రమ నిర్మాణా దారులకు నోటీసులు జారీ చేసి అధికారులను తప్పుదోవ పట్టించి ఇంటి నెంబర్లు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని ఇంటి నెంబర్లను కూడా రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ మౌనిక, నర్కుడ గ్రామపంచాయతీ సెక్రటరీ వజ్రలింగం, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.